అన్నమయ్య: ఈ నంబర్ గుర్తు పెట్టుకోండి..!

అన్నమయ్య జిల్లా రవాణాశాఖ అధికారి కె.ప్రసాద్, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్, కాంట్రాక్టు క్యారేజ్ బస్సు యజమానులు, ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని, అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలని స్పష్టం చేశారు. బస్సుల్లో హెల్ప్ లైన్ నంబర్ 9281607001 స్పష్టంగా కనిపించేలా రాయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్