రాయచోటి డిగ్రీకళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా డా.ఎ.శ్రీనివాసరావు

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డా. ఎ. శ్రీనివాసరావు నూతన రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నుంచి పదోన్నతిపై ఆయన రాయచోటికి వచ్చారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డా. శ్రీనివాసరావు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్