ఈడికిపల్లి: కరెంటు షాక్‌తో వ్యక్తి స్పాట్‌డెడ్

బుధవారం ఈడికిపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజా (45) అనే వ్యక్తి విద్యుత్ పనుల నిమిత్తం పోలోపల్లి పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజ్ సరిచేయడానికి కరెంటు స్తంభం ఎక్కాడు. దురదృష్టవశాత్తు 11కేవీ లైన్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్