రాయచోటిలో విద్యుత్ ఘాతం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రాయచోటి మండలం దిగువ అబ్బవరం-ఎగువ ఇందుకూరు పల్లెలో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభంపై పనిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై గుర్రంకొండ మండలానికి చెందిన హెల్పర్ వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో ఆయనను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందుతోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, వినోద్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్