అస్తవ్యస్తంగా కుంపిణీపురం రోడ్డు

రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నూకినేనిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సత్రం నుండి చింతకాయలపల్లె గ్రామం మీదుగా MM పురం క్రాస్ నుండి కుంపిణీపురం శ్రీ ఆంజనేయ స్వామి గుడి వరకు రోడ్డు పెద్ద పెద్ద గోతులు, మట్టితో నిండి పాదచారులకు, వాహనదారులకు చాలా ఇబ్బందికరముగా ఉన్నది. ప్రభుత్వం వారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు ఆ వైపే రావడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం వారు వెంటనే స్పందించి BT రోడ్డు వేయవలసిందిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు

సంబంధిత పోస్ట్

✕
✕