పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వివాహిత మృతి

లక్కిరెడ్డిపల్లి మండలంలోని దిన్నెపాడు గ్రామానికి చెందిన షేక్ హసీనా (38) శనివారం ఇంట్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై శోభ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతిపై బంధువులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్