రామాపురం మండలం చిట్లూరు మాలపల్లిలో మంగళవారం సాయంత్రం కురిసిన గాలివానకు భారీ పిడుగుపాటు సంభవించింది. గ్రామానికి చెందిన చంద్రయ్య ఇంటి వద్ద ఉన్న టెంకాయ చెట్టుపై ఉరుములు, మెరుపులతో కూడిన పెద్ద పిడుగు పడటంతో ఆ చెట్టు పూర్తిగా కాలిపోయింది. పిడుగు పడినప్పుడు వచ్చిన పెద్ద శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో చెట్టు దగ్గర ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.