రాయచోటి మండలం గుంటిమడుగులో నాగార్జున, మేరీ దంపతులపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నాగార్జున కాలు పాదం నుజ్జునుజ్జు కాగా, మేరీని అసభ్యంగా దూషిస్తూ ప్రైవేట్ భాగాలపై దాడి జరిగినట్లు బాధితులు మంగళవారం రాత్రి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించి, కేసు నమోదు చేయకుండా బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళ ఆయుధాలతో నిందితులు ఇంటిపైకి వచ్చి బెదిరిస్తున్నా రక్షణ కరువైందని, జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.