రాయచోటి పట్టణ పరిధిలోని మిట్టావాండ్లపల్లెలో పదవతరగతి విద్యార్ధిని సృజన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాత్రి జరిగిందని వారి తల్లిదండ్రులు తెలిపారు. వారి వివరాలు మేరకు తారకరత్న అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులు గురి చేశాడని విద్యార్థి తండ్రి చంద్రగిరి ఉత్తయ్య ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.