అఖిల భారత యాదవ జాతీయ అధ్యక్షుడు బుసగాని లక్ష్మయ్య ఆదివారం రాయచోటి పట్టణంలోని ఏస్ ఆర్ కల్యాణ మండపంలో జరిగిన యాదవుల సమైక్య సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యాదవులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వాలు యాదవ కులస్తులకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఈ సభను పదిలం మహేష్ కుమార్ యాదవ్ నిర్వహించారు.