రాయచోటి మండలం మాధవరంలో రైతు సేవా కేంద్రం శిలాఫలకాన్ని పగలగొట్టిన కేసులో వైఎస్సార్సీపీ యూత్ జనరల్ సెక్రటరీ షేక్ బిలవున్ భుట్టోను పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయ స్థలంలో తన అక్రమ నిర్మాణాల తొలగింపుపై కక్ష పెంచుకున్న అతడు, టీడీపీ కార్యకర్తలను ఇరికించేందుకు మే 25న తానే శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు విచారణలో అంగీకరించాడని గురువారం రాయచోటి పోలీసులు తెలిపారు. అనంతరం సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారం చేసినట్లు కూడా అంగీకరించాడు.