సంబేపల్లెలో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

సంబేపల్లె మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గురిటి వెంకటేశ్వర్లు (30) మృతి చెందాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాయచోటికి వెళ్తుండగా, రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బైక్‌తో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్