కలకడ - దేవపట్ల మార్గంలో గుట్టపల్లి సమీపంలో చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై ప్రయివేటు ట్రావెల్స్ బస్సు టైర్లలో పొగలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు, ఒక ట్రక్ డ్రైవర్ ఈ విషయాన్ని గమనించి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో, బస్సును రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులను సురక్షితంగా దించారు. డ్రైవర్లు వెంటనే సిలిండర్లతో కార్బన్ డయాక్సైడ్ స్ప్రే చేసి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.