శనివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి టౌన్‌లో మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 7మంది మైనర్లను గుర్తించి వారిని తల్లిదండ్రులతో సహా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, అధిక మొత్తంలో జరిమానా విధించారు. మైనర్‌తో పాటు వాహనం ఇచ్చిన యజమానులు కూడా చట్టరీత్యా ముద్దాయులవుతారని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సీఐ బి. వి. చలపతి కోరారు.