సొంత అక్క ఇంట్లోనే చోరీ

రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డు ఎస్టి కాలనీలో నివసిస్తున్న తిరుపతమ్మ అనే మహిళ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని సీఐ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఆదివారం అరెస్టు చేసి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సైలు భక్తవత్సలం, లోకేశ్ పేర్కొన్నారు. సొంత అక్క ఇంట్లోనే తిరుమలేశు చోరీ చేసినట్టుగా గుర్తించారు. తక్కువ సమయంలోనే చోరీ కేసును ఛేదించడంతో ఉన్నతాధికారులు సిబ్బందిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕