రాయచోటి పట్టణంలోని 8వ వార్డులో నీటి మోటార్ చెడిపోవడంతో స్థానికులు టీడీపీ నాయకుడు జబీవుల్లా దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, మౌర్య రెడ్డిల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించి, అధికారులతో మాట్లాడి కొత్త స్టార్టర్, బోరును పంపించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీనితో 8వ వార్డు ప్రజలు మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.