అంగళ్లు వద్ద ఆటో – బైక్ డీ.. ఓక వ్యక్తికి తీవ్ర గాయాలు

శనివారం రాత్రి కురబలకోట మండలం అంగళ్లు విశ్వం కళాశాల సమీపంలో ఆటోను బైక్ ఢీకొన్న ఘటనలో స్కూటరిస్టు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్