కురబలకోట మండలంలోని చేనేతనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్ల నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ప్రయాణికుల ఆటో, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఐసర్ లారీని ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని 108 వాహనం ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.