ఆస్తిలో వాటా పంచుకొని, అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపిన వివరాలు. బి. కొత్తకోట కు చెందిన నరసింహారెడ్డి(48) అదే ఊరికి చెందిన శ్రీదేవి 27 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు ఉన్నారు. భార్యను ఆస్తిలో వాటా, అదనపు కట్నం తీసుకురావాలని వేధించడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదుపై వేధింపుల కేసు నమోదు చేశామన్నారు.