బి. కొత్తకోట ముర్రోల్లపల్లిలో ఉండే కాంతారావు, గంగాదేవిలపై అదే ఊరిలో ఉండే సోమశేఖర్, సునీల్, లావణ్య, అమరావతి, గిరిబాబు, మౌనిక, కిట్టమ్మ దాడి చేశారు. వారంతా కబ్జాకు యత్నించడంతో మంగళవారం సాయంత్రం కాంతారావు అడ్డుకున్నాడు. దీంతో వారు దంపతులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో స్థానికులు వారిని వెంటనే మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ జీవన్ గంగానాథ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.