గురువారం రాత్రి కొత్తకోట పట్టణంలోని రంగసముద్రం రోడ్డులో పాపచ్చమ్మ హోటల్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలను దొంగిలించేందుకు ప్రయత్నించగా, స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టణంలో వాహనాల దొంగతనాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రిపూట గస్తీని పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు పోలీసులను కోరారు.