బి. కొత్తకోటలో బస్సు డ్రైవర్ ఓవరాక్షన్ గ్రామస్తుల ఆగ్రహం

మంగళవారం రాత్రి బి. కొత్తకోట మండలం కంబాలపల్లిలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ దురుసు ప్రవర్తనకు గ్రామస్తులు తిరగబడ్డారు. కదిరి – బెంగళూరు వెళ్లే బస్సు కంబాలపల్లి వద్ద ఆగకుండా వెళ్తుండటంతో గ్రామస్తులు నిలదీశారు. బస్సు ఆపే ప్రసక్తే లేదని, అడ్డొస్తే తొక్కిచేస్తానని డ్రైవర్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బస్సు యాజమాన్యం, డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్