రేపు చింతలగంగమ్మ జాతర..వైభవంగా ఏర్పాట్లు

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీపంలో శనివారం చింతలగంగమ్మ జాతర వైభవంగా జరగనుంది. గ్రామ పంతులు మణికంఠ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8:30కు అభిషేకం, పూజలు, సాయంత్రం 7:00కు పల్లకిలో గ్రామోత్సవం, రాత్రి 12:00కు జ్యోతులు, బాణాలు సమర్పణ ఉంటాయి. ఆలయ నిర్వాహకులు చిన్న మాట్లాడుతూ ఈసారి జాతరలో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, భక్తులు తరలివచ్చి ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్