పెద్దమండెంలో సైబర్ మోసం: గృహిణి ఖాతా నుంచి రూ. 95 వేలు దోపిడి

అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం కు చెందిన సౌందర్య అనే గృహిణి సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ. 95వేలు పోగొట్టుకుంది. సోమవారం మదనపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదుచేసి న్యాయం చేయాలని ఆమె కోరింది. క్విక్ టివియాప్ డౌన్లోడ్ చేసుకున్న ఆమె, అందులో ఒక రూపాయి కట్టమని సైబర్ మోసగాళ్లు చెప్పడంతో కట్టింది. రూపాయి కట్టిన వెంటనే ఆమె ఖాతాలో ఉన్న రూ.95,000 కాజేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్