రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి ఫీట్ల అంజలి(రాజనాలను)ని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. మంగళవారం ఆయనను తంబళ్ళపల్లిలోని స్వగృహంలో అంజలి మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు దుశాలువాతో సత్కరించి ఆయన ఆశీస్సులు పొందారు. ఈసందర్భంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చిన్నవయసులోనే బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా ఎదగడం హర్షణీయమని భవిష్యత్తులో బిజెపిలో కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి చేరాలని ఆశీర్వదించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి కృషిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని ఆశీర్వదించారు.