కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా: శంకర్ యాదవ్

తంబళ్లపల్లె నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరిన నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్ ని కురబలకోట మండలానికి చెందిన టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నాయకులు శంకర్ యాదవ్ ని కలిసి సమావేశానికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహించడం వంటి అంశాలపై పరస్పరం చర్చించారు. కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని శంకర్ యాదవ్ సూచించినట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕