కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ తుంగావారిపల్లెలో సోమవారం రాత్రి పాత కక్షల నేపథ్యంలో ఒక కుటుంబంపై కర్రలతో దాడి జరిగింది. గ్రామానికి చెందిన గురుప్రసాద్, మూలింటి నరసింహులు కుటుంబాల మధ్య భూ తగాదాలున్నాయి. మంగళవారం జరిగే కదిరి పున్నమి వేడుకల కోసం గుడిని శుభ్రం చేయడానికి వెళ్లిన గురుప్రసాద్ కుటుంబంపై నరసింహులు వర్గం అడ్డుకుని దాడి చేసింది. ఈ దాడిలో గురుప్రసాద్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.