కురబలకోట: ఆస్తి కోసం అన్నదమ్ములపై కర్రలతో దాడి

కురబలకోట మండలం దిగువపాలెంలో ఆస్తి తగాదాల కారణంగా అన్నదమ్ములు శంకర, నరసింహులుపై అదే గ్రామానికి చెందిన రెడ్డప్ప, రమేశ్ కర్రలతో దాడి చేశారు. గత కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తుండగా, సోమవారం రాత్రి తలెత్తిన ఘర్షణ మంగళవారం ఉదయం దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు పోలీసులను ఆశ్రయించి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్