కురబలకోట మండలం కడప క్రాస్ పంచాయతీలోని బుడతనరాళ్ల హరిజనవాడలో తాగునీటి ఎద్దడి నెలకొందని శనివారం గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఉండే బోరు పాడై, తాగునీళ్ల కోసం సమీపంలోని వ్యవసాయ బోర్ల దగ్గర తెచ్చుకుని గత 3 నెలలుగా దాహార్తి తీర్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో 21 కుటుంబాలు ఉన్నాయన్నారు. పంచాయతీ అధికారులకు, సర్పంచికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు బాగా బుద్ధి చెబుతామని తెలిపారు.