కురబలకోట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

గురువారం, పీటీఎం ప్రాంతానికి చెందిన రైతు బాబూలాల్ (60), నూర్ అహ్మద్ (16) ద్విచక్ర వాహనంపై మదనపల్లెకు వెళ్తుండగా కురబలకోట మండలం అమ్మచెరువు మిట్ట సమీపంలో బైక్ అదుపుతప్పి సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్