కురబలకోట మండలం కంటేవారి పల్లి వద్ద ఆదివారం లారీని బైకు ఢీకొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఎవరు అనేది తెలియ రాలేదు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ముదివేడు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి బి. కొత్తకోటకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.