మదనపల్లి మహిళ కురబలకోట మండలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై దిలీప్ కుమార్ వివరాల ప్రకారం మదనపల్లెలోని చంద్ర కాలనీకి చెందిన లక్ష్మీదేవి కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని సర్కారు తోపు వద్ద అల్లనేరేడు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.