విషం తాగి యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. సింగన్న గారి పల్లెకు చెందిన లలిత (27) పిల్లలను పాఠశాలకు పంపలేదని మందలించడంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను వేరే ఆసుపత్రికి తరలించారు.