తంబళ్లపల్లి మండలంలో గురువారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. మండలంలోని గుండ్లపల్లి పంచాయితీ దేవరింటిపల్లెకు చెందిన రైతురమణారెడ్డి పెంచుకుంటున్న గొర్రె గురువారం ఎనిమిది కాళ్ళతో ఉన్న గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. పుట్టగానే పిల్ల చనిపోయిందని ఆరైతు తెలిపారు. గొర్రె పిల్లను పశువైద్యాధికారులు పరిశీలించారు. జన్యుపరమైన లోపాలతో ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని పశువైద్యాధికారి సుజనశ్రీ వివరించారు.