అన్నమయ్య జిల్లాలోని బి. కొత్తకోటలో, మొరుసు కాపు (వక్కిలిగర) సామాజిక వర్గానికి చెందిన కెంపెగౌడ 517వ జయంతి వేడుకలను ఈ నెల 12వ తేదీ ఆదివారం నిర్వహించాలని తంబళ్లపల్లె నియోజకవర్గ మొరుసు కాపు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బెంగళూరు మహానగర నిర్మాత అయిన కెంపెగౌడ జయంతిని విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రతి మొరుసు కాపు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా హాజరు కావాలని వారు బుధవారం విజ్ఞప్తి చేశారు. ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.