తంబళ్లపల్లె నియోజకవర్గం మల్లయ్యకొండ గిరి ప్రదక్షిణలో ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, మల్లయ్యకొండ అభివృద్ధి, సంరక్షణ కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.