అప్పుడే పుట్టిన బిడ్డను ఓ కసాయి తల్లి ముళ్ళ పొదలో పడేసిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. మంగళవారం రాత్రి అప్పుడే పుట్టిన ఆడబిడ్డను ప్రభుత్వ కళాశాల వద్ద ముళ్ల పొదలో పడేశారు. స్థానికులు పసిబిడ్డ కేకలు విని అక్కడికి వెళ్లి అప్పుడే పుట్టిన పసిబిడ్డను గుర్తించారు. సులేమాన్, ఫర్వీన్ అనే మహిళలు చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. ఎవరు పడేశారు అనే విషయం తెలియ రాలేదు.