అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ములకలచెరువు మండలం చౌడసముద్రం పంచాయతీ చెట్ల వారిపల్లెకు చెందిన వెంకటరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా రోజులుగా వ్యవసాయం కోసం అప్పులు చేసి పంటలు చేతికిరాక మానసికంగా బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.