అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం వేపూరుకోట పంచాయతీ ఆవులవారిపల్లి క్రాస్ వద్ద గురువారం మధ్యాహ్నం లారీలోని పైపులు బొలెరో వాహనంపై పడడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి ములకలచెరువు పోలీసులు చేరుకొని ట్రాఫిక్ నియంత్రించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.