ములకల చెరువు మండలంలోని బురకాయలకోట వద్ద గురువారం బొలోరో పై ఇనుప పైపులు పడి రైతు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి అని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బి. కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీ పాత కురవపల్లికి చెందిన రైతు బక్కల రాజన్న మృతి చెందినట్లు గా ఎస్ ఐ నరసింహుడు గుర్తించారు. టమాటాల టెంపో భారీ లోడుతో చెన్నై వెళ్తున్న లారీని బురకాయలకోట సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.