ఆస్తిలో వాటా కోసం పొలం దగ్గర నిలదీయడంతో ఆగ్రహించిన అన్న తమ్ముడి కళ్ళలో కారం చల్లి కత్తితో దాడి చేశాడు. పెద్ద మండ్యం మండలంకు చెందిన సుధాకర్ రెడ్డి తన అన్న వెంకటరమణారెడ్డి మధ్య ఆస్తి వివాదం ఉంది. బుధవారం సాయంత్రం అన్నను ఆస్తిలో వాటా అడిగినందుకు కత్తితో దాడి చేసి గాయపరిచారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.