పెద్దమండెం: భూ వివాదంతో రైతుపై ప్రత్యర్థుల దాడి

పెద్దమండెం మండలంలో దారికాచి శనివారం వ్యక్తిపై ప్రత్యర్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఘటనపై బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం, మిట్ట మాలపల్లి కి చెందిన అమరేంద్ర (45) కు అదే గ్రామానికి చెందిన సాంబ శివయ్య వర్గీయులకు కొంతకాలంగా భూమి వివాదంతో గొడవలు ఉన్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలో పొలం వద్దకు వెళ్లి వస్తుండగా దారి కాచి ఆరుగురు కర్రలతో దాడి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్