తంబళ్లపల్లి తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు చేపట్టాలి

ఎల్నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రాధాన్యతనివ్వాలని ములకలచెరువు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీడీపీ నేత మయూన్ భాషా సూచించారు. ఆయన మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని దీంతో గ్రామాల తాగనీటి సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల వారీగా పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నీటిసమస్య ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంచేయాలని కోరారు. కాగా పశువులకు ఇబ్బందులు కలగకుండా ఉచిత పశుగ్రాస కేంద్రాలు, నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕