పీటీఎం మండలంలో బుధవారం భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో భర్త ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవపడి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటున్న భార్యను తిరిగి కాపురానికి రావాలని ఒత్తిడి తెచ్చినా అంగీకరించకపోవడంతో, ఆగ్రహంతో అత్తగారింటికి వెళ్లిన భర్త ఆమెతో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.