రామసముద్రం: అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడి

రామసముద్రం పెట్రోల్ బంకు సమీపంలో నివసించే రఫీక్, తన రెండో భార్య ఆస్మాపై అనుమానం, కుటుంబ కలహాల కారణంగా మంగళవారం ఉదయం కత్తితో పైశాచిక దాడికి పాల్పడ్డాడు. ఆవేశంలో రఫీక్ ఆమె రెండు చేతులను పదునైన కత్తితో కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాధితురాలిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్