రైతు పొలంలో అరుదైన పునుగు పిల్లి పిల్లలు ప్రత్యక్షం

తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె, మొరుసుపల్లి బురుజు గ్రామాల సమీపంలో అరుదైన పునుగు పిల్లి పిల్లలు కనిపించాయి. గురువారం ఉదయం దిగువపల్లెకు చెందిన రైతు శేఖర్ రెడ్డి, మాధవ రెడ్డిలు అటవీ సమీపంలోని దుడ్డోళ్లపల్లి గడ్డ వద్ద గల సజ్జ పంట పొలంలో పశువులకు మేత కోస్తుండగా ఈ రెండు పిల్లలను గుర్తించారు. మొదట కంగారుపడినా, తర్వాత సమీప రైతులతో కలిసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సంబంధిత పోస్ట్