తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె పంచాయతీ దిగువపల్లె వద్ద గురువారం అరుదైన జాతికి చెందిన రెండు నక్షత్ర తాబేళ్లు ప్రత్యక్షమయ్యాయి. గ్రామానికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లిన రైతులకు ఇవి దర్శనమిచ్చాయి. రైతు మలిగి వెంకటరమణ రెడ్డి గ్రామస్థులతో కలసి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వాటిని విడిచిపెట్టారు.