ములకలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ములకలచెరువు వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో, టాటా ఏస్ వాహనం ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో లోని చిన్నప్ప (56) చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామస్తులుగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్