కురబలకోటలో రోడ్డు ప్రమాదం

కురబలకోట మండలంలోని అంగళ్లు బస్టాండ్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్