అంగన్వాడీ ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్ యాదవ్

అన్నమయ్య జిల్లా కురబలకోట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవాల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు శ్రీమంతం, ఆరు నెలలు పూర్తిచేసుకున్న చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాల సేవలను ఆయన అభినందించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕